2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాల్లోనే తీవ్ర రాజకీయ నష్టం జరిగింది. అందులోనూ పశ్చిమలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ ఓటమిపాలైంది. అయితే 2014తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తోంది. ముఖ్యంగా ఉండి నియోజవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపార్టీ అభ్యర్ధి పెన్మత్స వెంకట లక్ష్మీ నరసింహరాజు (పీవీఎల్)కు ప్రజాదరణ పెరుగుతోంది. పీవీఎల్ కూడా రాజకీయంగా కాకుండా మానవీయంగా అందరి మనసులను గెలుచుకుంటున్నారు.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఒక్క రూపాయి ప్రభుత్వ సొమ్ము తినను.. కార్యకర్తలకు కష్టం కలిగించను.. మీ అందరికీ సేవ చేయాలనేదే నా కోరిక అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి ఉండికి వెళ్లిన పీవీఎల్ కు నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంతో ప్రేమతో ఆత్మీయస్వాగతం పలికారు.. ఈ సందర్భంగా పీవీఎల్ ఎటువంటి రాజకీయాలూ మాట్లాడలేదు.. అధికార పార్టీని విమర్శించలేదు. రూలింగ్ ఎమ్మెల్యేనూ ఒక్కమాట అనలేదు.. కేవలం కార్యకర్తల అభిమానాన్ని స్వీకరిస్తూనే మీకోసమే నేనున్నా అనే సంకేతాలిచ్చారు.
ఒక్కమాటలో చెప్పాలంటే నిజమైన నాయకుడిగా, పార్టీ పరంగా చెప్పాలంటే కార్యకర్తల క్షేమాన్ని కాంక్షించే లీడర్ గా పరిపక్వత కనబరిచారు పీవీఎల్. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మీ కష్టాల్లో అండగా ఉంటాను.. అవినీతికి పాల్పడను.. నాకు డబ్బుతో పనిలేదు.. మీరే ముఖ్యం.. ప్రతీ ఇంటికీ వస్తా.. ప్రతీ ఒక్కరినీ కలుస్తానంటూ పీవీఎల్ ముందుకు కదిలారు. జిల్లావ్యాప్తంగా వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్న క్రమంలో పీవీఎల్ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతున్నాయి. యువత, మహిళలు పీవీల్ కు బ్రహ్మరధం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పీవీఎల్ ను గెలిపించుకుంటామనే సంకేతాలిస్తున్నారు.