Home / 18+ / కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు

కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు

కేరళలలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాలన్నీ మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ వరదల్లోనే అధికారికంగా 320మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది గాయపడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేవు.. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్ధిక సాయం అందిస్తున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలనుంచి స్వచ్ఛంధ సంస్థలు పెద్దఎత్తున నిత్యావసర సరుకులు, బట్టలు పంపుతున్నారు. విజయవాడలోని ప్రేరణ ఫౌండేషన్ సభ్యులు కేరళ వరదబాధితుల సహాయార్ధం బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులు సేకరించి కేరళ తీసుకెళ్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి మనవంతుగా సహాయం చేయడమే అసలైన మానవత్వమని, మానవ సేవే మాధవ సేవగా పనిచేస్తున్న ప్రేరణ ఫౌండేషన్ ను సర్వత్రా అభినందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat