ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..ఇప్పటికీ కూడా ఆ సినిమా పలు చోట్ల దుసుకేల్తుంది.ఈ క్రమంలోనే ఈ ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని కుండ బద్దలు కొట్టేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..గత నాలుగు రోజుల క్రితం తనకు ఓ సినిమాలో అవకాశం వచ్చిందని.. కానీ ఆ సినిమా సెట్స్ లో ఉన్నంత కాలం రోజు తన రూమ్ కు వచ్చి పోవాలని కండీషన్ పెట్టాడుట ఆ సినిమాకు సంబంధించిన ఓ వ్యక్తి.అయితే అందుకు పాయల్ వెంటనే నో చెప్పిందట. నీ సినిమాలో అవకాశం కోసం నేను రాజీ పడాలా? ప‌్రతిభతో పైకి వచ్చినదాన్ని. గౌరవమైన కుటుంబం నుంచి సినిమాలపై ఫ్యాషన్ తో వచ్చాను. అవసరమైతే వృత్తినే వదిలేస్తాను గానీ…ప్రలోభాలకు లొంగనని స్పష్టం చెప్పేసిందట.అయితే పాయల్ కమిట్ మెంట్ అడిగిన వ్యక్తి పేరును మాత్రం ఎక్కడా లీక్ చేయలేదు. పాయల్ రాజ్ పుత్ మరాఠీ సూపర్ హిట్ సినిమా సైరత్ పంజాబీ రీమేక్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
