నాడు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ అలానే చెప్తున్నా.. రాసి పెట్టుకోండి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్తో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇది తధ్యం.. ఏ శక్తి వచ్చినా జగన్‌ను గెలుపును ఆపలేదు 2019 ఎన్నికల్లో జగన్ సిఎం అవ్వడం ఖాయమని చెప్పారు. సీనిమర్ జర్నలిస్ట్ సీతారామ రాజ.
కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు సీనియర్ జర్నలిస్ట్ సీతారామ రాజ ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఏ పెళ్లికి వెళ్లినా.. ఏ కార్యక్రమానికి వెళ్లినా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంటా.. అది చిన్నవాళ్లయినా సరే.. పెద్ద వాళ్లయినా సరే. ఇలా ప్రతీ ఒక్కరిని అడిగి వాళ్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంటా. అందులో భాగంగానే.. మెజార్టీ ప్రజలు చెప్పిన సమాధానం త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలతో మా ముఖ్యమంత్రి మారడున్నాడని, జగనే తమ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ..!
అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు షాకింగ్ ఫలితాలు ఎదురవ్వనున్నాయని, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులతో సహా మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు. టీడీపీ ఎంపీలయితే మూడో స్థానానికే పరిమితమవుతారని తేల్చేశారు. ఇక 107 స్థానాల్లో కేవలం 30 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు గెలుపొందుతారని, మిగిలిన స్థానాల్లో రెండో స్థానంతోనే టీడీపీ అభ్యర్థులు సరిపెట్టుకుంటారని చెప్పారు జర్నలిస్ట్ సీతారామ రాజ.
అయితే, జగన్ గురించి సీతారామరాజ చెప్పిన ఇంకా పలు ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే ఈ వీడియోతో మీ కోసం..