భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు,హిరోయిన్లు తమవంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 400కు చేరింది.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.కేరళ వరద బాధితులకు అండగా ఉండాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు ముందుకు వస్తున్నారు.
మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావు,మహేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డి తమ నెల జీతాన్ని విరాళంగా ఇస్తునట్లు ప్రకటించారు.ఈ క్రమంలోనే జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ తన రెండు నెలల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తునట్లు ప్రకటించారు.ఈ మేరకు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు ఒక లేఖ రాశారు.