మునుపెన్నడూ లేని విధంగా వరదలతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రతీ ఒక్కరు తమ వంతు భాద్యతగా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ , హరీష్‌రావు, మహేందర్ రెడ్డి లు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపిస్తామని చెప్పారు. కేరళ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తోందన్నారు. తమ మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు కూడా కేరళ ప్రజలకు అండగా ఉండాలని హరీష్, మహేందర్‌రెడ్డి వజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ కూడా నిన్న తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించి.. తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంత అందజేయాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
I will be donating my one month salary towards #KeralaFloodRelief & I'm very thankful to the Irrigation Department Engineers who came forward to donate their one day salary
I sincerely appeal to everyone to donate generously for our brothers & sisters in #Kerala#KeralaFloods
— Harish Rao Thanneeru (@trsharish) August 18, 2018
Besides the Telangana state Govt contribution of 25Cr to Kerala, I personally pledge my 1 month salary to flood relief. Will be sending the cheque to CMRF
Request my colleague legislators to also contribute as much as possible#TelanganaStandsWithKerala
— KTR (@KTRTRS) August 18, 2018