వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు.
తమకు రుణమాఫీ చేస్తానంటూ నమ్మబలికిన చంద్రబాబు… సీఎం పదవి చేపట్టాక తమను మరిచారంటూ డ్వాక్రా మహిళలు, రైతులు జగన్ వద్ద ఆవేదన వెలిబుచ్చుతున్నారు. తమకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ చేనేతలు, ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వదల్లేదంటూ నిరుద్యోగులు, ఆరోగ్య శ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కార్ నామ రూపాలు లేకుండా చేసిందని ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరు వారు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి కష్టనష్టాలను సవివరంగా తెలుసుకుంటూ.. తానున్నానన్న భరోసాను ప్రజలకు ఇస్తూ పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్.
ఇదిలా ఉండగా, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలో భాగంగా.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాత్రపై మీ అభిప్రాయమని యాంకర్ అడిగిన యాంకర్‌కు ప్రశ్నకు.. వైఎస్ జగన్ స మాధానం చెప్తూ.. 2014 ఎన్నికలను గుర్తు చేశారు.
ఏపీలో పవన్ కళ్యాన్ పార్టీ జనసేన ఎంత బలపడితే.. అంతకు మించి.. వైసీపీకి విజయావకాశాలు పెరుగుతాయని జగన్ అన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయని, ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా.. వైసీపీపై కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేపట్టాయన్నారు. ఇప్పుడు టీడీపీతో బీజేపీ, జనసేన పార్టీలు తెగదెంపులు చేసుకున్నాయని, అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఏపీకి చేసిన అన్యాయం దృష్ట్యా జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని తాను అనుకోవడం లేదని, ఈ నేపథ్యంలో జనసేన కూడా టీడీపీ లానే ఒంటరి పోరు తప్పదనే భావనను వ్యక్తం చేశారు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో టీడీపీకి పడ్డ జనసేన ఓట్లు.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేకంగా జనసేనకే పడబోతున్నాయి. ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకుంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపే శక్తి ఏ పార్టీకి లేదని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.