వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఈక్రమంలో జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపైనా జగన్ స్పందించారు. అయ్యన్నపాత్రుడి అవినీతిని లెక్కలు, ఆధారాలతో సహా జగన్ తన సభలో దుయ్యబట్టారు. అయితే దీనిపై అయ్యన్న స్పందిస్తూ నా అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగన్ మాట్లాడుతూ రాజకీయ వ్యవస్ధ చెడిపోయిందని జగన్ పదేపదే అనడం బాధాకరమన్నారు.
జగన్ లాంటి నేతల వల్ల రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని, చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. అయితే తన అవినీతిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి చెప్పడంతో విశాఖవాసులు షాకయ్యారు. జగన్ అయ్యన్నపాత్రుడి అవినీతిని లెక్కలు, ఆధారాలతో సహా చెప్తుంటే మళ్లీ లెక్కలు అడుగుతున్నాడేంటని, అయ్యన్న గాలిమాటలు మాట్లాడుతున్నారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. అయితే తన పార్టీలోకి వచ్చేవారిని రాజీనామా చేసి రమ్మనడం వల్లే జగన్ వల్ల విలువలు పడిపోతున్నాయట అని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ కూడా తన పొలిటికల్ పంచులతో అయ్యన్నను ఎండగడుతున్నారు. ప్రతీపనికీ లంచం తీసుకునేది ఆయనే..(అయ్యన్నే) అంటూ విమర్శిస్తున్నారు.