ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్ 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం మెట్టపాలెం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్, కృష్ణాపురం, దుగ్ధ క్రాస్ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు.
