గత ఎన్నికలకు, ఇప్పటికీ తేడాను ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వివరించారు . వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని వైఎస్ జగన్ దీమా వ్యక్తం చేశారు. . ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2014 ఎన్నికల్లోలో చంద్రబాబు నాయుడుకు సంబందించి ప్రబుత్వ వ్యతిరేకత( యాంటి ఎస్టాబ్లిష్ మెంట్ ) లేదని, కాని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోందని జగన్ అన్నారు. గత ఎన్నికలలో బీజేపీ, పవన్ కళ్యాణ్ లు తెలుగుదేశం సైకిల్ కు రెండు చక్రాలుగా పనిచేశారని,వారు ఇప్పటికే తప్పు కున్నారని ఆయన గుర్తు చేశారు.రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పి మోసం చేశారని, ఇప్పుడు బ్యాంకులలో రైతుల రుణాలు లక్షా పాతికవేల కోట్లకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. గతసారి అన్ని అంశాలు చంద్రబాబుకు కలిసి వచ్చినా, తమకు ఆయనకు మద్య కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని జగన్ అన్నారు. ఈ సారి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తమ విజయం ఖాయమని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
