ఏపీలో విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దుర్గమ్మ గుడి ట్రస్టుబోర్డు మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గుడిలో లైంగిక వేదింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబందించిన పిర్యాదులు వచ్చిన చైర్మన్ గౌరంగ బాబుతొక్కి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఐదుగురు మహిళలు చర్మన్ కు పిర్యాదు చేశారని కూడా ఆమె వెల్లడించారు.
వెలగపూడి శంకరబాబు అనే పాలమండలి సభ్యుడిపై ఆరోపణలు వచ్చాని చైర్మన్ చర్య తీసుకోలేదని ఆమె అన్నారు.ఓపిఎస్ డి చెందిన మహిళలపైన లైంగిక వేధింపులు జరిగాయని, గుడిలో పనిచేసే మహిళలను లొంగదీసుకుంటున్నారని సూర్యలత ఆరోపించారు.
వెలగపూడి శంకరబాబును చైర్మన్ వెనకేసుకు వస్తున్నారని ఆమె అన్నారు. సిసి రోడ్డు పనుల్లో ఆరు కోట్లు, ఘాట్ రోడ్డు పనులలో మూడు కోట్ల అవినీతి జరిగిందని ఆమె అన్నారు. ఇటీవల వేరే వివాదంలో సూర్యలతను పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ ఆరోపణలు చేయడం విశేషం.ఈ విషయాలలో తాను వ్యతిరేకించానని, అందుకే తనపై కక్ష కట్టారని, తాను తప్పు చేయకపోయినా పదవి నుంచి తొలగించారని ఆమె అన్నారు.