యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన గోప్పమనస్సును చాటుకున్నారు.కేరళ రాష్ట్రానికి తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.కేరళ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కేరళ రాష్ట్రానికి అండగా పలు రాష్ట్రాలు ఆర్ధిక సాయంగా ప్రకటించగా..తాజాగా యువ క్రికెటర్ సంజూ శాంసన్ కేరళకు తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తండ్రి, సోదరుడు ఈ మేరకు ముఖ్యమంత్రికి చెక్ అందించారు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదని, వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయంగా ఉండేందుకే చేశానని శాంసన్ తెలిపాడు.