వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద కేరళను కుదిపేస్తుంది. ఇప్పటివరకూ కేరళలో 385 మంది మృతిచెందగా… 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎక్కడ చూసినా వరదనీరే… ఛిద్రమైన ఇళ్లు కనిపిస్తున్నాయి. వందలాది గ్రామాలు ద్వీపాలుగా మారిపోయాయి. ఎక్కడికక్కడ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. తక్షణ సహాయం చేకపోతే ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలడంతో రోగులతో ఆస్ప్రులు కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల ప్రాథమిక చికిత్స కోసం అవసరమైన మందులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. పెట్రోల్ బంక్‌లు ఖాళీ అయ్యాయి… వరద ప్రవాహంలో వన్య మృగాలు కొట్టుకుపోతున్నాయి. జాతీయ విపత్తు బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది
