గత వారం రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపడుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు సహాయం చేయగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్లు సహాయం చేసింది.ఏపీ ప్రభుత్వం 10కోట్లు సహాయం చేసింది.అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు హీరోలు స్పందించి..అర్ధికసాయంగా వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రంలోని పరిస్థితిలపై వై సీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ..భారీ వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళ పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తోందని అన్నారు . కేరళ ప్రజల కోసం తన ప్రార్థనలు, ఆలోచనలు ఈ కష్టకాలంలో అండగా ఉంటాయని, విపత్తుతో తల్లడిల్లుతోన్న కేరళవాసులకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండాలని జగన్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The devastation caused by the #KeralaFloods is gut-wrenching. My thoughts & prayers are with the people of Kerala in these testing times. Urge the Central govt to provide all possible assistance to support relief & rehabilitation measures for people affected by this calamity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 18, 2018