దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు..
ఈ క్రమంలో మోహాన్ లాల్ ,మమ్ముట్టి రూ. ఇరవై ఐదు లక్షలు చొప్పున సాయం.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ రెండు విడతల్లో రూ యాబై లక్షలు ఇచ్చింది.. మరో యువనటుడు తొవినో థామస్ మరో అడుగు ముందుకేసి ఇరింజలక్కుడలోని తన ఇంటిలో బాధితులకు ఆశ్రయం కల్పించారు.. అక్కడితో ఆగకుండా వరదలు తగ్గే వరకు బాధితులకు నిత్యవసర సరుకులను అందజేస్తాను అని ముందుకొచ్చాడు.
మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ అందరికంటే ముందు ఐదు లక్షల రూపాయాలను అందజేశారు. అల్లు అర్జున్ కూడా ఇరవై ఐదు లక్షలను ప్రకటించాడు.. గీత గోవిందం సినిమా వసూళ్ళను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు. తమిళ హీరోలైన కమల్ హాసన్ ,సూర్య కార్తి ,విజయ్ సేతుపతి రూ. ఇరవై ఐదు లక్షల చొప్పున విరాళమిచ్చారు.. అంతేకాకుండా సూర్య ప్రత్యేకంగా అమ్మ (amma)ఫండ్ కు రూ. పదికోట్లను విరాళంగా అందించారు..సిద్దార్థ్ తన వంతుగా పది లక్షలను ,హీరో ధనుష్ రూ.పదిహేను లక్షలు,శివకార్తికేయన్ రూ.పది లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమందించారు..