కేరళ రాష్ట్రంలో వరదలతో ,వర్షాలతో సతమతవుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది గూగుల్ . ఈ క్రమంలో రాష్ట్రంలో భారీ వరదలు,వర్షాల కారణంగా మూడు వందలకు పైగా మృత్యు వాతపడగా.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు అని సమాచారం. ఈ క్రమంలో గూగుల్ సంస్థ బాధితులకు అండగా ఉండేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోయిన కానీ ఆఫ్ లైన్లో తాము ఉన్న స్థలాన్ని లోకేషన్ షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది గూగుల్ ..
వరదల్లో చిక్కుకున్న బాధితులు తమ అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ,టాబ్లెట్లు ద్వారా పంపవచ్చు అని ప్రకటించింది. అందులో భాగంగా తమ స్మార్ట్ ఫోన్ల,టాబ్లెట్లు ద్వారా సరిగ్గా తాము ప్రస్తుతం ఉన్న లోకేషన్ పై ప్లస్ కోడ్ ను జనరేట్ చేసి షేర్ చేస్కొవచ్చు అని తెలిపింది.దీనిద్వారా బాధితులు ప్రస్తుతం ఎక్కడున్నరో సరిగ్గా అంచనా వేసుకునేందుకు ..సహాయక బృందాలకు తెలియడానికి ..వారు దగ్గరకి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అని గూగుల్ సంస్థ తెలిపింది.అంతే కాకుండా వినియోగదారులు వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా కూడా తమ ప్లస్ కోడ్ లను షేర్ చేస్కొవచ్చు..