కేరళ రాష్ట్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు,వర్షాలు అల్లకల్లొలం చేస్తున్నసంగతి తెల్సిందే.. ఈ తీవ్ర వర్షాలతో దాదాపు నాలుగు వందల మంది మృత్యు వాత పడ్డారని సమాచారం. కొన్ని వేల మంది నిరాశ్రయులైనారు. ఈ క్రమంలో కేరళ వరద బాధితులకు అండగా యావత్తు దేశమంతా ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యువహీరో ,గీత గోవిందం హీరో అయిన విజయ్ దేవరకొండ అందరి కంటే ముందు రూ ఐదు లక్షలను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమందించారు.
అంతే కాకుండా కేరళ రాష్ట్రాన్ని అదుకొవడానికి అందరూ ముందుకురావాలని పులుపునిచ్చారు. ఈక్రమంలో తను నటించి.. ప్రస్తుతం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న గీత గోవిందం సినిమా యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ సినిమాకు వచ్చే వసూళ్ళను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని తెలిపారు.