ఏపీలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వలసల పర్వం మొదలైనట్లే ఉంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి . ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదు..
కాపులకు పదివేల కోట్లను కేటాయిస్తాను అని గంటపథంగా చెప్పారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలతో ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .. ఈ క్రమంలో ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని జిల్లా రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి…