ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు సరిదిద్దుకుంటారా ? లేదా అదే ఆటతీరుతో కొనసాగుతారా?అనేదానికోసం వేచిచూడాలి.అయితే తుది జట్టులో కొన్ని మార్పులతో జరిగే అవకాశముంది.
టీమ్ సభ్యులు..
కోహ్లి ఇప్పటి వరకు 37 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా .. ఏ రెండు టెస్ట్ లోను అదే టీం లేకుండా మార్పులు చేస్తునాడు.వరుసగా విఫలం అవుతున్న ఓపెనర్స్ మురళి విజయ్ ,KL రాహుల్ వీరిద్దరిలో ఒకరిపై వేటుపడొచ్చు..ఆ స్థానంలో ధావన్ కి చోటుదక్కే అవకాసం ఉంది. ఇక వికెట్‌కీపర్ దినేష్ కార్తీక్ కూడా బాటింగ్ లో దారుణంగా విఫలం అయ్యాడు మరియు వికెట్‌కీపింగ్ కూడా సరిగా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో కరుణ్ నాయర్‌కు అవకాశం దక్కవచ్చు. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం దాదాపు ఖాయమైంది.
