బిగ్‌బాస్ 2 లో ప్రతీ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ముందే తెలిసిపోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్నీ నిజమేనని తేలిపోయింది. ఇక ఈ వారం లీక్ కూడా 100శాతం కరెక్ట్ అవుతుందనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలిమినేషన్ లిస్టులో పదవ వారంలో బిగ్‌బాస్‌ను వదిలి వెళ్లే వారి జాబితాలో గీతా మాధూరి, రోల్ రైడా, దీప్తి సునైనా, పూజా రాంచంద్రన్, శ్యామల, నూతన్ నాయుడు ఉన్నారు. వీరిలో నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై ప్రేక్షకుల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇకపోతే బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్దంగా నిద్రించడంతో ఈ వారం శిక్ష కూడా పడింది. దీంతో దీప్తి సునైనానే ఎలిమినేట్ ముప్పు వెంటాడుతున్నది. గురువారం ఎపిసోడ్ లో జరిగినకాల్ సెంటర్ టాస్క్‌లో కంప్యూటర్ ముందే కూర్చొని భోజనం చేయడం, కాళ్లు టేబుల్ పెట్టి నీచంగా, చాలా దురుణంగా ప్రవర్తించడం చాలా మంది ప్రేక్షకులకు రుచించలేదు. అంతేకాకుండా, కాల్ సెంటర్ టాస్క్‌లో అభ్యంతరకమైన భాషను ఉపయోగించడం కూడా దీప్తి సునైనాకు మైనస్‌గా మారింది. అలాగే కౌశల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన ముఖంపై ఉమ్మి వేయడం కూడా ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఖచ్చితంగా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొంటే దీప్తి సునైనాకు ఈవారం ఎలిమినేట్ అనే మాట బలంగా వినిపిస్తున్నది.
