మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి.
ఈ క్రమంలో అటల్ మృతి గురించి ఆయన దగ్గర దాదాపు ఐదు దశాబ్ధాల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శివకుమార్ శర్మ సంచలన విషయాలు చెప్పారు. అటల్ మృతి అనంతరం ఆయన మీడియాతో విషాదవదనంతో మాట్లాడుతూ అటల్ జీ తాని నిష్క్రమించే సమయం వచ్చిందని సరిగ్గా ఏడేండ్ల ముందే తనతో అన్నారు అని ఆయన అన్నారు . 2007లో అటల్ జీకి గుండెపోటు వచ్చింది. అప్పట్లో ఆయనకు రెండు సార్లు ఆపరేషన్ నిర్వహించారు.
ఆ సమయంలో ఇరవై రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. అటల్ జీ నడవటానికి కూడా ఇబ్బంది పడేవారు.ఆ తర్వాత 2011నుండి ఆయన ఆరోగ్యం మరింత దిగజారుతూ వచ్చింది.మరికొద్ది రోజుల్లో ఎయిమ్స్ లో చేరతారనగా నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది శర్మా అని ఆయన నాతో అన్నారు అని వాజ్ పేయి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా యాబై ఏళ్ళకుపైగా పనిచేసిన శర్మ గద్గద స్వరంతో మీడియాకు తెలిపారు..