మరికొన్ని గంటల్లో ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇండోనేషియా రాజధాని ఐన జకార్తాలోని జీబీకే స్టేడియంలో 18వ ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు గనంగా జరగనున్నాయి. 11,000 మంది అథ్లెట్లు, 5,000 మంది అధికారులు హాజరయ్యే ఈ ఇ గేమ్స్ కి జకార్తా, పాలెంబాగ్ ఆతిథ్యమిస్తున్నాయి. ఈ క్రీడలకుగాను ఇండోనేషియా ‘ఎనర్జీ అఫ్ ఆసియా’స్లోగన్ పెట్టింది. గురువారమే మన భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకం ఎగరేశారు. మాజీ ప్రధాని వాజపేయి మరణం కారణంగా సాధారణంగా జరిగిన ఇ జెండా ఆవిష్కరణకు మన భారత్ హాకీ జట్టు మరియు అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెట్ల పెరేడ్ ప్రారంభo లో ఆసియా క్రీడల్లో నీరజ్ భారత పతాకాన్ని పట్టుకొని నడుస్తాడు. ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.. ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియా సంస్కృతిని రుపొందిచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. దీనికి అనుగుణంగా సిబ్బంది అతిపెద్ద స్టేజి నిర్మించడం జరిగింది.ఈ స్టేజిపై 4,000 మంది డ్యాన్సర్లు నాట్యం చేయనున్నారు. ఈ వేడుకలను భారత్లో సోనీ టెలివిజన్ ప్రసారం చేయనుంది.