Home / ANDHRAPRADESH / సర్వే ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో విచిత్ర ఫలితాలు.. విస్తుపోతున్న సీనియర్లు

సర్వే ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో విచిత్ర ఫలితాలు.. విస్తుపోతున్న సీనియర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ‌రి కొద్ది మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను అన్నిపార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కుర్చీ కోసం టీడీపీ-వైసీపీ-మ‌ధ్య ఉత్కంఠ పోరు నెల‌కొంది. ఇక‌, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ జ‌న‌సేన‌లు కూడా తమ ప్రభావం చూపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆ‍యా పార్టీల అధ్యక్షులు ప్రజలలో ఉంటూ హామీలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతం గోదావరి జిల్లాలు ముగించుకుని ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం విశాఖజిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 2014 ఎన్నికలలో 5లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించిన చంద్రబాబు తన పరిపాలనాకాలంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలు రాష్ట్రంలో నెరవేర్చకుండా తన పాలనను సాగిస్తున్న నేపద్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత నెలకొంది. మరిముఖ్యంగా కేంద్రం నుండి రాష్ట్రానికి న్యాయపరంగా విభజన హామీలు కూడా అధికారంలో ఉండి చంద్రబాబు తీసుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా చంద్రబాబుని పట్ల వ్యతిరేకతతో ఉన్నారు.

మ‌రో ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండిపోరాటాలు సాగించ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల న‌మ్మ‌కం క‌ల‌గ‌టానికి దోహ‌దం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో ఆయ‌న సుదీర్ఘంగా సాగిస్తున్న పాద యాత్ర ఏపీ చ‌రిత్ర‌లో కొత్త అధ్య‌యం సృష్టిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌గ‌న్ బ‌హిరంగ‌స‌భ‌కు హాజ‌ర‌వుతున్న ప్ర‌జ‌లు, జ‌గ‌న్ ప‌ట్ల వారు క‌న‌బ‌రుస్తున్న ఆధ‌రాభిమానాలు చూస్తుంటే జ‌గ‌న్ ప‌ట్ల వారు సానుకూలంగా ఉన్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చాలా కసిగా ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధినేత జగన్ కచ్చితంగా బలమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని నిర్మిస్తారని అంటున్నాయి సర్వేలు.. ఇప్పటికే వైసీపీ చేయించిన సర్వేల్లో ఆపార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెలియగా.. విచిత్రంగా చంద్రబాబు చేయించిన సర్వేలో టీడీపీ ఘోర పరాజయం పాలవుతుందని తెలుస్తోందట.. అలాగే పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ టీడీపీ భారీ ఓటమిని మూట కట్టుకుంటుందనే మాట వినిపించింది. ఆసక్తికరంగా కొన్ని జిల్లాల్లో వైసీపీ భారీ ఆధిపత్యం కనబరుస్తుండగా తర్వాతి స్థానంలో జనసేన ఉండగా టీడీపీ మూడవ స్థానానికి పడిపోయిందట.. అయితే హోదాపై యూటర్న్, అమలు కాని హామీలు, కులాల వారీగా చేసిన వాగ్ధానాలు, మహిళలపై దాడులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు, పార్టీ ఫిరాయింపులు, కాంగ్రెస్ తో దోస్తీ కట్టే ప్రయత్నాలు వంటి ఎన్నో కారణాలు టీడీపీ ఓటమి కారణాలుగా సర్వేల్లో కనిపిస్తున్నాయి. అయితే దశబ్దాల పాటు రాజకీయలను చూసిన సీనియర్లే ఈ ఫలితాలు అందుకోలేకున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat