ఏపీలో అధికారక టీడీపీలోకి వైసీపీ నుండి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్రంలో పార్వతీపురం మున్సిపాలిటీ కి చెందిన వైసీపీ కౌనిలర్లు ,కార్యకర్తలు ఎమ్మెల్సీ డి.జగదీష్ సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీకి చెందిన కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాస్ ,జ్యోతీతో పాటుగా కౌన్సిలర్లుగా బరిలోకి దిగిన పలువురు నేతలు,ఆ పార్టీ కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.వీరందరికీ చంద్రబాబు నాయుడు పసుపుకండువా కప్పి టీడీపీలోకి ఆహ్వనించారు..