తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు.రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం తధ్యం అని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని…రాహుల్ తెలంగాణలో అడ్డా వేసినా టీఆర్ఎస్ పార్టీ గెలుపును అడ్డుకోలేరన్నారు .రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని చెప్పారు.