ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్లో మొమోరియల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాజ్దీప్ సర్దేశాయ్ ఓ ట్వీట్ చేశారు. ‘అటల్జీకి తన అంతిమ యాత్రలో బీజేపీ న్యాయం చేస్తోంది. దివంగత పీవీ నరసింహరావు విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయింది. భారతదేశానికి చెందిన ప్రధానుల జాబితాలో అటల్జీకి తగు గౌరవం దక్కింది’ అని రాజ్దీప్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్తం చేసుకోలేదనే రాజ్దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
Couldn’t agree more https://t.co/I4AGM6MaYH
— KTR (@KTRTRS) August 17, 2018