తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్ నేతలుగా ముద్ర పడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్‌లో చీలిక వచ్చిందా? అన్నాదమ్ములైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య లుకలుకలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది మీడియాలో. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో చిన్నవారైన రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారేందుకు మొగ్గుచూపుతున్నట్టు జరుగుతోంది.
టీపీసీసీ ఉత్తమ్ మీద ఒంటికాలి మీద లేచిన కొమటి రెడ్డి బ్రదర్స్.. ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఆర్ధిక వ్యవహారాలు, కాంట్రాక్టులు వంటి అంశాల్లో ప్రభుత్వంతో ఉండే పనుల నేపథ్యంలో అధికార పార్టీతో వెళితేనే మంచిదన్న భావనలో ఉన్నారట. ఈ వార్త గుప్పుమనడంతో ఇద్దరు సోదరుల మధ్య గ్యాప్ వచ్చిందింటున్నారు.
కాగా, ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇస్తూ తాను పార్టీ మారేది లేదన్నారు. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం అటు అధికార పార్టీలో…ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.