తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు.
ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు ఎంపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి అంకూస్ అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీగా తరలిరావడం విశేషం..