మచ్చలేని నాయకుడు ,ఉత్తమ పార్లమెంటేరియన్, 3 సార్లు ప్రధాని అయిన అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపసూచకంగా అన్ని రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించాయి.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ సెలవు దినంగా ప్రకటించాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సెలవుగా ప్రకటించలేదు.. కారణం బీజేపీపై ఉన్న కోపంతోనేనని ఆపార్టీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చివరకు బీజేపీయేతర రాష్ట్రాలుగా ఉన్న డిల్లీ, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు సైతం ఇవాళ సెలవుదినంగా ప్రకటించాయి. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంగా ఉన్న పంజాబ్ కూడా ఇవాళ సెలవుఇచ్చింది. కానీ వాజ్ పేయి ప్రభుత్వంలో గతంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆయన మరణానంతరం కూడా చావువద్ద కూడా రాజకీయంగా ప్రవర్తిస్తున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో నీవు భాగస్వామి అని మరిచిపోయావా చంద్రబాబూ.? ఛీ మరీ ఇంత అవకాశవాదమా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం యావత్ రాష్ట్రానికే చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉందని మండిపడుతున్నారు.
