ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్ది ఫిరాయింపు రాజకీయాల సైడ్ ఎఫెక్ట్స్ టీడీపీని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీని సెటిల్ చేయలేక చంద్రబాబు సతమతమవుతుంటే.. ఇప్పుడు కడప జిల్లా జమ్మలమడుగులోనూ వివాదం రాజుకుంది. ఆదాయంలో 50-50గా పంచుకుని హ్యాపీగా ఉండండని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు, రామసుబ్బారెడ్డికి మధ్య సెటిల్ మెంట్ చేశారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ మధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల గోల మొదలైంది.జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు టికెట్ కోసం ఇప్పటి నుంచే సిగపట్లకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని ఆదినారాయణరెడ్డి చెప్పుకోవడంపై రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించగా.. ఆది మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ తనదేనని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను సీనియర్ నాయకుడినని చెప్పుకున్నారు.
అయితే జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు.. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తామనే హామీ ఇచ్చారని అలాంటిది ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటన చేస్తారని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇలా ఒకరికి ఒకరు నాకే అంటే నాకే అని అనుకుంటువుంటి మరి ప్రజలు ఎలా ఉన్నారో వారికి తెలియడంలేదా. వైసీపీ లో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కూడా లభించింది.. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరిన తర్వాత జమ్మలమడుగు రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.. ఆదినారాయణరెడ్డి పార్టీలోకి రావడాన్ని రామసుబ్బారెడ్డి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది.ఆదినారాయణరెడ్డి వర్గం చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు..? అలాంటి ఆదినారాయణరెడ్డికి తాము ఓట్లు వేయాలా? అని అంటున్నారట! వచ్చే ఎన్నికలలో ఆదినారాయణరెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గం ఓటు వేయదని గట్టి వాదన కూడ వినిపిస్తుంది. అంతేకాదు ఆదినారాయణరెడ్డికి ఓటేస్తే వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తమ ఆప్తుల ఆత్మలు క్షోభిస్తాయని అంటున్నారు కొందరు. మరి ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అసలు టీడీపీ అధికారంలోకి రాదు…ఏపీ మొత్తం టీడీపీపై తీవ్ర వ్యతీరేకత వచ్చింది. వైసీపీని గెలిపిస్తే ..టీడీపీలోకి పోతివి..ఇక నిన్ను గెలిపిస్తే ప్రజలకు శూన్యం అని ప్రజలు తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిస్తామని ఆ నియోజక వర్గ ప్రజలే అంటున్నారు