ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు అన్షు వినోద్ తాయేద్. వయస్సు తొమ్మిది సంవత్సరాలు. వినోద్ తాయేద్, రూపాలి తాయేద్.. అన్షు తల్లిదండ్రులు. అయితే, అన్షు వినోద్ తాయేద్ ప్రస్తుతం తీవ్రమైన తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అన్షుకు తలసేమియా వ్యాధి తీవ్రం కావడంతో అతని తల్లిదండ్రులు జులై నెలలో అహ్మదాబాద్‌లోని సోలా పట్టణ పరిధిలోగల కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్) వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల కోసం అన్షు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
అన్షు తల్లి రూపాలి తాయేద్ మాట్లాడుతూ.. నా కుమారుడు అన్షు వినోద్ తాయేద్ కు తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. తన శరీరంలోని ఎముకల మూలుగలలో రక్త కణాల ఉత్పత్తి జరగకపోవడం లేదని, తనకు ఎముకల ట్రాన్స్‌పరేషన్ చేయాలని వైద్యులు తెలిపారని రూపాలి తాయేద్ ఎంతో ఆవేదనతో చెప్పారు. అన్షుకు ఆపరేషన్ చేస్తే నయమవుతుందని, అయితే, అదే సైజులో ఉండో ఎముకలు అవసరపడుతుందని వైద్యులు చెప్పారు. అయితే, అదృష్టవ శాతు అన్షు చిన్న తమ్ముడు ఆర్యన్ ఎముక ఒకటి సరిపోతుందని, అయితే, ఎముక ట్రాన్స్‌పరేషన్‌కు రూ.9 లక్షలు ($ 13,850) ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే, అంత ఖర్చు భరించే శక్తి మాకు లేదు అంటూ అన్షు తల్లి రూపాలి కన్నీరుమున్నీరైంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆస్తులు, నగదుతోపాటు.. తమ సన్నిహితుల వద్ద నుంచి తీసుకున్న రూ.4 లక్షలు ఖర్చు అయిపోయాయని, అన్షుకు బోన్ ట్రాన్స్‌పరేషన్ చేయించే ఆర్థిక స్థోమత తమ వద్ద లేదని, దాతలు సహాయం చేయాలని తల్లి విజ్ఞప్తి చేస్తోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో అన్షు కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న అన్షుకు బోన్ ట్రాన్సపరేషన్‌కు అయ్యే ఖర్చు కోసం డబ్బు సహాయం చేసేవారు.. ఈ కింద అడ్రసును సంప్రదించగలరు.