అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి ప్రదాత. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శనం ప్రతీ భారతీయుడికి అండగా ఉంటుంది. వాజ్పేయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని మోడీ ట్వీట్ చేశారు.కాగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
