కూలీ చేస్తేగానీ.. పూటగడవని చోట ఏ ఒక్కరికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ పరిస్థితి తిరగబడినట్టే. అలాంటిరికి అండగా నిలబడాలనే ఆలోచనతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి.. ఎన్నో గడపల్లో సంతోషాలను నింపారు. అదే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. ప్రజ సంక్షేమం కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను దారి పొడవున ఎంతో మంది కలుస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేసిన మేలును కొడుకుతో చెప్పుకుంటూ.. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్యం చేయించుకునే స్థోమత లేక బాధపడే వారు ఆ జన ప్రవాహంలో ఊరూరా కనిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కరుణకుమార్ కుటుంబం కూడా అలాంటిదే.
కరుణకుమార్, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు. అందులో ఒకరికి పుట్టుకతోనే చూపు లేదు. దానికితోడు హార్ట్‌లో హోల్ ఉందని.. ఆపరేషన్ కచ్చితంగా చేయాలని వైద్యులు చెప్పడంతో కన్నవాళ్లకు దిక్కు తోచలేదు. అంతంత మాత్రంగా పనిచేస్తున్న ఆరోగ్య శ్రీ దయవల్లే మొత్తానికి గుండె ఆపరేషన్ అయితే పూర్తయింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ధ్యాసంతా ఈ చిన్నారికి చూపు వచ్చే చేయాలని, అందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎవరైనా నేత్రదానం చేస్తే.. కంటి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో వారి ఆశ రెట్టింపయింది. అదే ఆశను పెట్టుకుని ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసింది తల్లి లక్ష్మీ దేవి.
తల్లి లక్ష్మీదేవి చెప్పిన మొత్తం విని.. వైఎస్ జగన్ స్పందించిన తీరు.. తల్లి మనస్సుకు ఎంతో సాంత్వన చేకూర్చింది. చూపురాగానే తన బిడ్డ వైఎస్ జగన్‌నే చూస్తానని చెబుతోందని ఎంతో ఆనందంగా చెప్పింది లక్ష్మీ దేవి.