సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లకు గిరాకీ ఏర్పడింది. బ్యాంకులకంటే అధికంగా వడ్డీ చెల్లిస్తామని చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్టాక్ మార్కెట్‌లో బాండ్లకు మంచిన వడ్డీ 10.32 శాతం సీఆర్డీఏ ఆఫర్ ఇవ్వడంతో బఢా పెట్టుబడిదారులు సీఆర్డీయే బాండ్లను భారీగా కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇచ్చే వడ్డీకంటే అదనంగా మూడుశాతం రావడం ప్రభుత్వమే గ్యారెంటీగా నిలవడంతో షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేవారంతా అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని మేథావులు అంటున్నారు. పన్నుల రూపంలో అధిక వడ్డీలు చెల్లించాల్సింది ప్రజలే కాబట్టి వారిపైనే బాండ్ల రూపంలో చెల్లించాల్సిన అధిక వడ్డీ భారం పడుతుందంటున్నారు మేధావులు.
ఏపీ ప్రభుత్వం చేపట్టినట్టుగానే హైదరాబాద్ పూణ నగరపాలక సంస్థ బాండ్లను జారీ చేసినప్పటికీ ఇంతక అధిక వడ్డీ ఆఫర్ చేయలేదు. మరి, ఏపీ ప్రభుత్వం ఎందుకు అధిక వడ్డీలు చెల్లించేందుకు అంగీకరించిందంటే..? ఎంత అప్పు చేసినా తీర్చేది ప్రజలే. పడేది వచ్చే ప్రభుత్వంపైనే ఈ ఒత్తిడి పడుతుందన్న ఆలోచనతోనే చంద్రబాబు సర్కార్ ఈ విధంగా చేసిందన్న విమర్శలు వినవస్తున్నాయి.
దీని ద్వారా అమరావతి రాజధాని పేరు చెప్పుకుని రూ.13,00 కోట్లు సమీకరించి ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నెట్టుకు రావచ్చన్నది చంద్రబాబు ఎత్తుగడ అని నిపుణులు అంటున్నారు.