వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలికి దెయ్యాలంటే చాలా భయమట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడం గమనార్హం. అంతేగాక, దెయ్యం గురించిన సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఆగస్టు 10న వరంగల్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు గడిచిన సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి ఈ విషయం బయటపెట్టారు. జార్జ్ పామర్ అనే ఆయన భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తితో కొన్ని నెలలుగా శోధించా’ అని ఆమ్రపాలి తెలిపారు. నిజాం కాలంలో ఆయనో గొప్ప ఇంజినీర్ అని తెలుసుకున్నారు. అయితే కలెక్టర్ బంగ్లాలో దెయ్యముందని, రాత్రి పూట పడుకోవాలంటే తనకు భయమని స్వయంగా ఆమ్రపాలి షాకింగ్ విషయాలు చెప్పారు. బంగ్లాలోని మొదటి అంతస్థులో దెయ్యం ఉందని తనకు పాత కలెక్టర్లు చెప్పారని తెలిపారు. తనను రాత్రి వేళ అక్కడ పడుకోవద్దని సలహా ఇచ్చారని కూడా కలెక్టర్ చెప్పారు. అంతేకాదు ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతో అక్కడ పడుకోవడానికి సాహసించలేనని ఆమ్రపాలి చెప్పుకొచ్చారు.
