మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి గతకొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 5:05 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా తెలిపారు.
అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు..
- 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు.
- చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు.
- 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని..23 రోజులు జైలు జీవితం గడిపారు.
- 1947లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టారు.
- 1951లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధంతో భారతీయ జనసంఘ్ ఏర్పాటులో కీలకపాత్ర వహించారు.
- 1957లో బలరామ్‌పూర్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
- 1975 ఎమర్జెన్సీ కాలంలో ఇందిర పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
- 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతాపార్టీ ఘనవిజయం సాధించారు.
- బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, షెకావత్‌తో కలసి 1980లో భారతీయ జనతాపార్టీ స్థాపించారు.
- 1984లో రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే బీజేపీ సాధించింది.
- 1995లో బీజేపీ ప్రధాన అభ్యర్థిగా వాజ్‌పేయిని అడ్వాణీ ప్రకటించారు.
- 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.
- 1996లో తొలిసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో 13 రోజులకు రాజీనామా చేశారు.
- 1998 ఎన్నికల తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు.
- 1999 జులై 26 పాక్‌తో కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది.
- 1999-2004లో ఐదేళ్ల పాటు సంకీర్ణ సర్కార్‌ను నడిపిన అపర చాణక్యుడుగా ఆయన కీర్తింపడ్డారు.
- 1998లో రెండోసారి 13 నెలలు ప్రధానిగా ఉన్నారు
- 2009లో స్ట్రోక్‌కు గురయ్యారు. అప్పటినుంచి ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోయారు.
- 1992లో పద్మవిభూషణ్,
- 2014, డిసెంబర్ 25న మోదీ ప్రభుత్వం.. వాజపేయికి భారతరత్నను ప్రకటించింది.