మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వాజ్ పేయితో తమకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా శుక్రవారం ఉదయం 9గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి డెడ్ బాడీని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సందర్శకులకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. శుక్రవారం సాయంత్రం రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో వాజ్ పేయీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.