ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్
ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు.
అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత నాలుగు ఏళ్ళుగా అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఏమి చేయకపోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేయడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
అంతే కాకుండా గత నాలుగు ఏళ్ళుగా బాబు నిర్వహించిన పలు సర్వేలలో టీడీపీ ఘోరంగా ఓడిపొవడమే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో పార్టీలో ఉండి పరువు పోగొట్టుకోవడం కంటే జిల్లాలో ,రాష్ట్రంలో మంచి పేరున్న ..రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేలడంతో మేడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు అంట. అయితే తన సోదరుడు కూడా వైసీపీలో ఉండటంతో ఆయన చేరికకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . దీంతో మరికొద్ది రోజుల్లో జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం ఖాయం అన్నమాట .