ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. మరల అధికారంలోకి రాలేమని నైరాశ్యమో లేదా మరో పదేండ్ల వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని భయమో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారు.
తాజాగా కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు బుధవారం ఆగస్టు 15న వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై తెలుగు తమ్ముళ్ళు కుట్రలకు పాల్పడ్డారు. అందులో భాగంగా పాదయాత్ర సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లేక్సీలను చించేసి వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లను ,ఫ్లేక్సీలను కట్టుకున్నారు..
అంతే కాకుండా ఈ తతాంగం అంతా సాక్షత్తూ పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం..ఈ దారుణాన్ని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులకు తెగబడ్దారు.. పాదయాత్ర మానుకొకపోతే మాజీ ఎంపీపై దాడికి కూడా తెగబడతామని వాళ్ళు హెచ్చరించారు..