Home / NATIONAL / హ‌రీశ్‌రావు కౌంట‌ర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌

హ‌రీశ్‌రావు కౌంట‌ర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఆయ‌న సార‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ నేత‌,  మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర పర్య‌ట‌న సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ట్విట్టర్ వేదికగా మంత్రి హ‌రీశ్‌ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్త‌వాలు, అర్ధ‌స‌త్యాలు మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు.

“కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని 38 వేల కోట్ల నుంచి…లక్ష కోట్లకు పెంచారని రాహుల్ కు స్క్రిప్ట్ రైటర్లు చెప్పారు. కానీ ప్రాణహిత-చేవెళ్ల తొలి జీవో 17 వేల కోట్లకు జారీ చేశారని వారు మరచిపోయారు“ అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. “ఏడాది వ్యవధిలో కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే…2008లో 38 వేల కోట్లకు, 2010లో 40 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశారుప్రాజెక్టు వ్యయం ఆ విధంగా ఎందుకు పెంచారో రాహుల్ చెప్పగలరా..?“ అని సూటిగా ప్ర‌శ్నించారు. “కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల 190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించింది…లక్ష కోట్లకు కాదు.. ఈ విషయం రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్లకు తెలియదా-? రీ డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ను సీడబ్ల్యూసీ ఆమోదించి…అన్ని అనుమతులను కేవలం ఏడాది వ్యవధిలోనే ఇచ్చింది“అని ట్విట్టర్లో మంత్రి హరీశ్ రావు స్ప‌ష్టం చేశారు.

“మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్ బాడీ. జ‌లవనరుల శాఖకు ఇది అనుబంధం…ఈ విషయంపై రాహుల్ కు, ఆయన స్క్రిప్ట్ రైటర్లకు అవగాహన ఉందా…? అలాంటి అత్యున్నత కమిషన్ విశ్వసనీయతను రాహుల్ ఎలా అనుమానిస్తారు..?“ అంటూ హ‌రీశ్ రావు సూటిగా ప్ర‌శ్నించారు. అంబేడ్కర్ ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని…రాహుల్ గాంధీ చెప్పారు, అలా చెప్పి స్క్రిప్టు రైటర్లు రాహుల్ ను మళ్లీ తప్పుదోవ పట్టించారని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే…అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే ఉందని ట్విట్టర్లో మంత్రి హరీశ్ రావు సూటిగా కౌంట‌ర్ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat