72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని,విప్ బుద్దా వెంకన్న కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ 72 సంవత్సరాల లో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి దేశం ముందుకి వెళ్తుందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్లడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్రాని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి సీఎం గారి కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇదే సందర్భంగా బీజేపీపై కేశినేని నాని విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ద్రోహి అని ఆరోపించారు. బీజేపీలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి అని మండిపడ్డారు. పురందేశ్వరి, కన్నా ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారు అయ్యారని ఆరోపించారు. ప్రజలు బీజేపీ ని తరిమి కొట్టేందుకు రెడీగా ఉన్నారన్నారు. కాగా, జెండా వందనం అనంతరం ఇలా విరుచుకుపడే రీతిలో కామెంట్లు చేయడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.