Home / 18+ / 2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌, రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు గ‌త ఎన‌నిక‌ల్లో రుణాలు మాఫీ చేస్తామ‌ని, ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని, నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పి త‌మ ఓట్ల‌ను దండుకున్న త‌రువాత‌.. త‌మ‌ను పూర్తిగా మోసం చేశారంటూ చంద్ర‌బాబు చేసిన ద్రోహాన్ని వైఎస్ జ‌గ‌న‌కు చెప్పి క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, జ‌గ‌న్ పాద‌యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ విప‌రీతంగా పెరిగింద‌ని, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వైసీపీని అధికారంలోకి తీసుకు వ‌స్తాయ‌ని ఇటీవ‌ల కాలంలో ప‌లు స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు పార్టీల నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి.

అయితే, మంగ‌ళ‌వారం నాడు వైఎస్ జ‌గ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను ముగించుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే కోటనందూరులో జననేత సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పలువురు పార్టీలో చేరారు. తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తొండంగి మాజీ సర్పంచ్‌ పెదిరెడ్డి సురేష్, కోటనందూరుకు చెందిన దంతులూరి శివబాబు, దంతులూరి రాజబాబు, దంతులూరి విష్ణుబాబు, దంతులూరి శ్రీనుబాబులతో పాటు పలువురు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జగన్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరగలాంటే జగన్‌ సీఎం కావాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat