భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆజెండాలకు వందనం చేసారు.
ఏపీ ముఖ్యమంత్రి మాత్రం కనీసం జెండా కూడా పూర్తిగా ఎగురవేయలేదు.. జెండా పూర్తిగా లాగకుండా వదిలేయడంతో పక్కనున్న పోలీసు అధికారి జెండాను ఎగురవేసారు. (ప్రతీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది) అలాగే జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ఎవ్వరైనా ఆ ఎగురుతున్న జెండాకు నమస్కరించాలి లేదా సెల్యూట్ చేయాలి కానీ చంద్రబాబు మీడియాకు, వీడియో కెమెరాలకు, ఫోటో కెమెరాలకు సెల్యూట్ పెడుతూ జాతీయ జెండావైపు చూడలేదు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్నచంద్రబాబు కనీసం జెండావైపు చూడకపోవడం, అలాగే మీడియాకు ఫోజులివ్వడం మరోవైపు సీఎం నివాసంలో టెర్రస్ పైన దొడ్డిదారిన మంత్రి అయిన లోకేశ్ భార్య సెల్యూట్ స్వీకరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే దేశంలోని ప్రధాని నుంచి సామాన్య పౌరవుల వరకూ అందరూ గుండెలపైన జెండాను అతికించుకుంటే చంద్రబాబు కనీసం తన జేబుపై కూడా పెట్టుకోలేకపోయారు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం మన దౌర్భాగ్యమంటూ నెటిజన్లు చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు జగన్ జాతీయగీతం ఆలపిస్తున్నంతసేపు జాతీయ జెండావైపే చూస్తూ సెల్యూట్ చేయడం కనిపించింది. మొత్తమ్మీద చంద్రబాబు ఆగస్ట్ 15న నాలుగు తప్పులు చేసారు.. ఒకటి జెండాను పూర్తిగా లాగకపోవడం, బూట్లు తీయకపోవడం, జెండాకు మాని కెమెరాలకు సెల్యూట్ చేయడం, త్రివర్ణపతాకాన్ని ఒంటిపై ధరించకపోవడం. అయితే ఈ వేడుక పేరుతోమాత్రం స్కూల్ పిల్లలను, ప్రజలను ఓ గంట ఉపన్యాసంతో చంపుకుతిన్నారనే విమర్శ ఉంది.