తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటకు బయలుదేరి వెళ్ళారు ..