కొరియో గ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా ఆ తరువాత హీరోగా పరిచయమయ్యాడు. నటుడిగా సక్సెస్ అయిన తరువాత.. మెగా ఫోన్ పట్టుకుని సక్సెస్‌ఫుల డైరెక్టర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్, రౌడీ రాథోడ్ వంటి హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫర్‌గా.. హీరోగా, డైరెక్టర్‌గా సక్సెస్ అయిన ప్రభుదేవా ఈ మధ్య వెనకపడిపోయిన విషయం తెలిసిందే.
అయితే, హిందీలో ఇటువల వరుసగా తీసిన నాలుగు సినిమాలు నిరాశపరచడంతో మరోసారి మెగా ఫోన్ పట్టే అవకాశం ప్రభుదేవాకు రాలేదు. 2015లో వచ్చిన సింగ్ ఈజ్ బ్లింగ్ తరువాత మరోసారి డైరెక్షన్ జోలికి వెళ్లకుండా నటనను కంటిన్యూ చేస్తున్నాడు ప్రభుదేవా.
అభినేత్రి బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయినా ప్రభుదేవాకు మాత్రం ఆఫర్స్‌ను తీసుకొచ్చింది. ఎంతలా అంటే.. క్షణం తీరిక లేనంతగా అన్నమాట. ఈ డ్యాన్స్ మాస్టర్ ప్రస్తుతం తమిళంలో ఆరు.. హిందీలో ఓ చిత్రం చేస్తున్నాడు. డ్యాన్స్ నేపథ్యంలో లక్ష్మీ సినిమా తెరకెక్కుతుంది. అభినేత్రి తీసిన ఏఎల్ విజయ్ దర్శకుడు. లెజెండరీ డ్యాన్సర్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభుదేవా మరోసారి తనదైన డ్యాన్స్ మార్క్‌తో ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి.