విశాఖ జిల్లా ఎర్రవరంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇవాళ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్‌సీపీ నాయకులు సన్మానించారు.
అల్లూరి సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణ రాజు కుమారుడు వెంకట సుబ్బారావు, కుమార్తె సత్యవతిలను సత్కరించారు. వారికి అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని బహుకరించారు వైసీపీ నేతలు.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమ ప్రాంతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని వారన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డపై మువ్వన్నెల జెండాను వైఎస్ జగన్ ఎగురవేయడం గర్వకారణమన్నారు.