ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన నుంచి విముక్తిని పొందాలంటే, వైఎస్ఆర్ కుటుంబంలో చేరాలని ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ ఏపీ ప్రజలను కోరింది. వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి 91210 91210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలని, పార్టీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడవచ్చని తెలిపింది. కార్యాలయంలో వైఎస్ జగన్ ఉన్న సమయంలో ఆయనే స్వయంగా మాట్లాడతారని, మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి ఆయన ఫోన్ చేస్తారని పేర్కొంది. చంద్రబాబు పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను, తమ ప్రాంత సమస్యలను గురించి చెప్పుకోవచ్చని పేర్కొంది. దీంతో రోజు కొన్నివేలమంది ఆ నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
