వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన బలమైన నేతల్ని తనవైపు తిప్పుకునేందుకు పాదయాత్రను ఎంచుకున్నాడు. ఇందులో బాగాంగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పనబాక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట.. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మి కేంద్రమంత్రిగా పనిచేశారు. వైఎస్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో గడ్డుపరిస్థితులు నెలకొనడంతో నాలుగేళ్ల పాటు వేచిచూసినా ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో పనబాక దంపతులు ఇటీవల తమ అనుచరులు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారట.ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ వైసీపీలో చేరాలని తమ అభిప్రాయాలను వెల్లడించారట. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ పార్టీలో చేరేందుకు కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వైసీపీ జిల్లా నేతతో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో విశాఖ జిల్లాలో పాదయాత్రలో బాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి త్వరలోనే వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పనబాక దంపతులు రెడీ అవుతున్నట్లు వారి సన్నిహితులు పేర్కొంటున్నారు. మరి పనబాక ఫ్యామిలీ ఎప్పుడు వైసీపీలోకి చేరే రోజు కోసం చూడాలి.