తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు
వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ పీటర్ ఎన్. వర్ఘీస్ పర్యవేక్షణలో “భారతదేశం యొక్క ఆర్ధిక వ్యూహం 2035 “ అనే అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించారు. భారతదేశంలో వ్యాపారాల స్థాపనలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా ముఖ్యమైనది అని తెలిపారు.
అయినప్పటికీ దేశంలో విదేశీ వ్యాపారం యొక్క రోజువారీ జీవితాన్ని సులభం లేదా కష్టతరం చేయడానికి భూమి,భౌగోళిక పరిస్థితులు, కార్మిక నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పనలు, నియమ నిబంధనలు మరియు పరిమితులు వంటి అనేక విషయాలను రాష్ట్రాలు ఆచరణాత్మకంగా నియంత్రిస్తాయి. .
ఈ పై కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని తగిన వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించే రాష్ట్రాలపై మాత్రమే తమదేశ వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాలని సిఫారసు చేసింది.
ఈ నివేదికలో పేర్కొన్న రాష్ట్రాలు, నగరాలు వివిధ రంగాలకనుగుణంగా అనుగుణంగా ఆస్ ట్రేడ్ తమ ప్రాధాన్యతలకు, అవసరాలకు అమరుయు తన ఉనికికి తగువిదంగా నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా 500 పేజీల సుదీర్ఘ నివేదికలో తెలంగాణతో సహా 10 రాష్ట్రాలను చేర్చారు. ఇతర రాష్ట్రాలు కూడా అవకాశాలను అందిస్తాయి, అయితే ఈ రాష్ట్రాలన్నింటిలోను పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడి అభివృద్ధిపథంలో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణాలో మాత్రం కొంచెం భిన్నంగా అత్యంత అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
దేశంలోనే సౌరవిద్యుత్తు ఉత్పాదనలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, రానున్న సంవత్సరాల్లో ఈ ఉత్పాదనను మరింత పెంచాలనే దృఢసంకల్పంతో వినూత్న ప్రణాళికతో తెలంగాణ ముందుకు సాగుతుందని అధ్యయనం పేర్కొంది. బలమైన ఆర్థిక పునాదులను ఏర్పరుచుకోవడంతో పాటు రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్యంపై 4.8 శాతం ఖర్చు చేయటం ఒక ఆకర్షణ అని, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రైవేటు హెల్త్ కేర్ సంస్థలు మరియు దేశంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోతమ వ్యాపారాలు స్థాపించాలని కోరుకునే ఆస్ట్రేలియన్ కంపెనీలకు ఎంట్రీ పాయింట్లు ఉండాలని నగరాల జాబితాలో కనుగొన్నారు.IT సంస్థల క్లస్టరింగ్ సంస్కృతి బెంగుళూరులో ప్రారంభమైనప్పటికీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గత నాలుగేళ్లలో ఇది చాలాఅభివృద్ధి చెందిందని, బలమైన ‘ఫెమ్ టెక్ ఉన్న ఎకో సిస్టం’ ఆవిర్భావానికి దారితీసిందని అధ్యయనం వెల్లడించింది.”తెలంగాణలో టీ – హబ్, భారతదేశం యొక్క అతి పెద్ద ప్రారంభ ఇన్క్యుబేటర్” అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇది ఒక అతిపెద్ద ఆవిష్కరణ అని, అలాగే పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా IT వ్యాపార మరియు ఇతర వాణిజ్య సంస్థల వ్యవస్థాపకులు కోసం తెలంగాణ రాష్ట్రముఒక ప్రపంచ గమ్యస్థానంగా మారింది అన్నారు.ఈ అధ్యయనం ప్రకారం తెలంగాణ రాష్ట్రము2017 వరకు మూడుసంవత్సరాల్లో సంవత్సరానికి 9.5% వృద్ధి రేటును చూపిస్తూ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది అని ప్రశంసల్లో ముంచెత్తారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కృతఙ్ఞతలు తెలియజేసారు.