ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా అయన వివిధ సభలలో పాల్గొని ప్రసంగించారు.అయితే ఈ పర్యటనలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ సినీయర్ నేతలకు గట్టిగా క్లాస్ పికారు.ఇవాళ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు.. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి మరియు రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారితో రాహుల్ విడివిడిగా మాట్లాడి పార్టీ ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.అయితే ఈ మీటింగ్ లో రాహుల్ వారితో మాట్లాడుతూ, నేతలంతా విబేధాలను పక్కనపెట్టి, ఐక్యంగా పని చేయాలని సూచించారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొంచెం ఆవేశం తగ్గించాలని..అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా క్లాస్ ఇచ్చారని సమాచారం.అయితే ఈ భేటీ సందర్భంగా నేతల మధ్య సఖ్యత లేదనే విషయాన్నీ రాహుల్ గ్రహించినట్టు తెలుస్తుంది.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కలసి పని చేయాలని వారికి రాహుల్ ఈ సందర్బంగా సూచించారు.